Breaking News

వందేభారత్‌ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి

Published on Sat, 09/28/2024 - 12:24

న్యూఢిల్లీ: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్‌’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల  మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే  అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్‌ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.

కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి  అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను జోడించామని  తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్‌కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)