Breaking News

ఆరో రోజూ వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. పర్యాటకుల అడ్వాన్సులు వాపను

Published on Mon, 09/01/2025 - 07:36

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి యాత్రా మార్గంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురవడానికితోడు, అసురక్షిత పరిస్థితులు ఏర్పడిన కారణంగా వైష్ణో దేవి యాత్రను ఆరవరోజు (ఆదివారం) కూడా నిలిపివేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్‌ఎంబీడీఎస్‌బీ)భక్తులు ఈ సమయంలో చేసిన అన్ని బుకింగ్‌లను రద్దు చేస్తూ, వారి సొమ్మును తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించింది.

వైష్ణోదేవి యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడిన అనంతరం.. కాట్రా నుండి భవన్‌కు హెలికాప్టర్ సేవలు, భవన్ నుండి భైరోన్ ఘాటికి రోప్‌వే రైడ్‌లు, హోటల్ వసతి , ఇతర యాత్రా సంబంధిత బుకింగ్‌లన్నీ రద్దయ్యాయి. యాత్రికులు తమ వివరాలను refund@maavaishnodevi.net కు ఈ మెయిల్ చేయడం ద్వారా డబ్బుల వాపసుకు అభ్యర్థించవచ్చని పుణ్యక్షేత్ర బోర్డు‘ఎక్స్‌’లో తెలిపింది. వీటిని 15 రోజుల్లోపు ప్రాసెస్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం నుంచి కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. త్రికూట కొండలపై  పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. యాత్ర పునఃప్రారంభంపై అధికారులు ఇంకా వెల్లడించలేదు. విపత్తు ఘటనపై దర్యాప్తునకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  ముగ్గురు ఉన్నత స్థాయి సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌కు జల్ శక్తి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి షలీన్ కబ్రా నేతృత్వం వహిస్తారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను గుర్తించడం, ముందు జాగ్రత్త చర్యలలో ఏవైనా లోపాలు ఉన్నాయో పరిశీలించడంలాంటివి తెలుసుకోవడం ఈ కమిటీకి బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించడానికి  ఈ తరహా డేటా సేకరణ ఉపయుక్తం కానుంది. కమిటీ తమ నివేదికను రెండు వారాల్లోపు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హాకు సమర్పించాల్సి ఉంటుంది.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)