నవరాత్రులకు వైష్ణోదేవి ముస్తాబు.. ప్రత్యేక కార్యక్రమాల నిలిపివేత

Published on Sat, 09/20/2025 - 09:19

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలోగల త్రికూట కొండలలో కొలువైన మాతా వైష్ణో దేవి పవిత్ర గుహ ఆలయం శారదా నవరాత్రులకు ముస్తాబయ్యింది.  సోమవారం(సెప్టెబర్‌ 22) నుండి ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల ఉత్సవాలకు  ఆలయంలో సకల ఏర్పాట్లు చేశారు.

నవరాత్రులలో వైష్ణోదేవిని సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా యాత్రికులకు సౌకర్యాలు కల్పించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు అధికారి ఒకరు  తెలిపారు. 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన హిందూ  ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు.  ఈ తొమ్మిది రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి , విదేశాల నుండి కూడా యాత్రికులు వైష్ణోదేవి గుహ మందిరాన్ని సందర్శించేందుకు తరలివస్తారు. నవరాత్రుల ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఆలయ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మాతా వైష్ణో దేవి గర్భగుడి, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అద్భుతమైన పూలతో  అలంకరిస్తున్నారని, ఆలయ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన, రంగురంగుల లైట్లతో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.

ఉదయం, సాయంత్రం హారతి సమయంలో ప్రముఖ గాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు. మరోవైపు బోర్డు సీఈఓ సచిన్ కుమార్.. వైశ్య భవన్,  బాన్ గంగా, తారకోట్ మర్గ్‌ లలో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆలయానికి వెళ్లే దారుల వెంబడి 24 గంటలూ నీరు, విద్యుత్ సరఫరా, శానిటైజేషన్, మెడికేర్, ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కాగా ఆగస్టు 26న కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు మరణించిన దృష్ట్యా, ఈ ఏడాది ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదు. దుర్ఘటన దరిమిలా ఎల్‌జీ మనోజ్ సిన్హా ఆగస్టు 29న అదనపు ప్రధాన కార్యదర్శి షలీన్ కబ్రా, ఐజీపీ భీమ్ సేన్ టుటి, జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్‌లతో కూడిన ప్యానెల్‌తో దర్యాప్తునకు ఆదేశించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)