Breaking News

Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’

Published on Sat, 03/15/2025 - 13:16

వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారును వేగంగా నడిపి, ఒక మహిళ మృతికి కారణమైన రక్షిత్‌ రవీష్‌  చౌరాసియా పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని పేర్కొన్నాడు. గురువారం రాత్రి వడోదరలో రక్షిత్‌ నడుపుతున్న కారు ఒక స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు రక్షిత్‌ను అరెస్టు చేశారు.

నిందితుడు రక్షిత్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళుతున్నదని, ఇంతలో తాను రైట్‌ సైడ్‌ తీసుకున్నానని తెలిపారు. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉన్నదని, దీంతో కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నదన్నారు. ఇంతలో ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకున్నదని, ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియలేదన్నారు. తమ కారు ప్రమాదం జరిగిన సమయంలో50 కి.మీ. స్పీడులోనే వెళుతున్నదని, తాను మద్యం తీసుకోలేదని, హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నామని రక్షిత్‌ తెలిపారు.
 

వడోదర పోలీస్‌ కమిషనర్‌(Police Commissioner) నరసింహ మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారన్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్నవారి నుంచి సమాచారం సేకర్తిస్తున్నామని, రక్షిత్‌ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదయ్యిదన్నారు. అయితే రక్షిత్‌ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తులో లేనని చెబుతున్నాడని, ఈ కేసులో నిజానిజాలు నిర్థారించాల్సి ఉందన్నారు. 

ఇది కూడా చదవండి: దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్‌-పాక్‌లకు ఏమి దక్కాయి?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)