Breaking News

లోయలో పడిన బస్సు.. 30 మంది దుర్మరణం

Published on Sat, 10/05/2024 - 12:42

పౌరీ: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతిచెందివుంటారని ప్రాథమిక సమాచారం.

ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం అతిథులతో వచ్చిన ఒక బస్సు హరిద్వార్ సమీపంలోని లాల్ ధంగ్ ప్రాంతం నుంచి పౌరీ జిల్లాలోని బిరోంఖల్ గ్రామానికి వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గమ్యస్థానానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డులో కొండ పైకి వెళుతుండగా, బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 30 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్‌ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్‌

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు