Breaking News

UP: తోడేళ్ల దాడులు.. కుక్కను చంపిన గ్రామస్తులు

Published on Sat, 09/07/2024 - 07:42

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తోడేళ్ల వరుసదాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో తోడేళ్లు కనిపిస్తే చంపేసేందుకు గస్తీ కాస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి మహ్సీ తహసీల్‌లోని ఓ గ్రామంలో తోడేలు అనుకుని కుక్కను చంపారు గ్రామస్తులు.

చనిపోయిన కుక్క ముగ్గురిపై దాడి చేసిందని చెబుతున్నారు. గ్రామంలోని పలువురిపై తోడేలు దాడి జరిగిందని సమాచారమందడంతో ఫారెస్ట్‌ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.  అప్పటికే గ్రామస్తులు తమపై దాడి చేసిన జంతువును చంపేశారు. ఫారెస్ట్‌ అధికారులు వెళ్లి చూసి చనిపోయిన జంతువు కుక్క అని తేల్చారు. 

మరోవైపు కుక్కదాడిలో గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహ్సీ, బహ్రెయిచ్‌లో ఈ ఏడాది  మార్చ్‌ నుంచి జరుగుతున్న తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా 30 మంది దాకా గాయపడ్డారు. వీరిలో 20 మందిదాకా తీవ్రంగా గాయపడ్డారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)