Breaking News

ఆ ఒక్క రాష్ట్రంలోనే 2కోట్ల 89 లక్షల ఓట్ల తొలగింపు

Published on Tue, 01/06/2026 - 18:51

పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పక్కన పెట్టి.. ఈ ప్రక్రియను కొనసాగించాలని కోర్టులు సైతం ఆదేశించాయి. దీంతో.. ఎన్నికల సంఘం చకచకా ప్రక్రియను కొనసాగిస్తోంది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి  సంబంధించి ఎస్‌ఐఆర్  (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) నివేదికను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 2కోట్ల 89 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు తెలిపింది. 

దేశంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా పారదర్శకంగా రూపొందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం 2025లో (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమగ్రంగా సర్వే జరిపి కొత్త ఎంట్రీలను చేర్చడం, అర్హత లేనివి తొలగించడం.. ఇంకా ఏవైనా సవరణలుంటే చేయడం తదితరమైనవి చేయనున్నారు. అయితే ఇటీవలే యూపీలో (SIR) సర్వే నిర్వహించగా తాజాగా దాని వివరాలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు.

దీనిపై ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ "రాష్ట్రంలో మెుత్తంగా 15కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 12 కోట్ల మంది వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. మెుత్తంగా 81శాతం మంది సర్వే పత్రాలపై సంతకం చేసి సమర్పించారు. 18శాతం మంది పాల్గొనలేదు. ఓటర్ల సర్వేలో  46.32లక్షల మంది ఓటర్లు మరణించిన‍ట్లు తేలింది. 2.17 కోట్ల మంది వలసకు వేరే ప్రాంతం వెళ్లారు. 25.47 లక్షల మంది వారి పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నారు". అని తెలిపారు. రమారమీగా దాదాపు 3 కోట్ల మందిని ఓటర్ల జాబితానుండి తొలిగించినట్లు పేర్కొన్నారు.

దీంతో దేశంలో అత్యధిక శాతం ఓట్ల తొలగింపు జరిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డులోకెక్కింది. ఉత్తరప్రదేశ్ 18.75శాతం, తమిళనాడు 15శాతం, గుజరాత్ 14.5శాతం ఆ తరువాతి స్థానాల్లో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఆరు వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 91శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని మరో తొమ్మిదిశాతం మిగిలి ఉందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)