Breaking News

డ్రెస్‌ కోడ్‌ వివాదం.. స్పందించిన డింపుల్‌ యాదవ్‌

Published on Wed, 07/23/2025 - 14:32

ఉత్తర ప్రదేశ్‌లో ‘మసీదు రాజకీయం’ తీవ్ర చర్చనీయాంశమైంది. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ కొందరి పార్టీ నేతలో ఓ మసీదులో భేటీ అయినట్లు ఉన్న ఓ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అయితే.. ‍ప్రార్థనా స్థలాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని బీజేపీ విమర్శలు గుప్పించగా.. దానికి ఎస్పీ అంతే దీటుగా బదులిచ్చింది. 

సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ తాజాగా పార్లమెంట్‌ సమీపంలోని ఓ మసీదుకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.  అయితే మసీదులో రాజకీయ భేటీ జరపడం ఏంటి? అని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఆయన సతీమణి, ఎంపీ డింపుల్‌ యాదవ్‌ వస్త్రధారణపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.  

ప్రార్థనా స్థలాన్ని ఎస్పీ పార్టీ అనధికారిక కార్యాలయంగా మార్చేశారంటూ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్‌ సిద్ధిఖీ మండిపడ్డారు. ఎస్పీ ఎంపీ నద్వీ ఆ మసీదుకు ఇమామ్‌. అలాంటి చోట రాజకీయ సమావేశాలు జరపడం ఏంటి? అని ప్రశ్నించారాయన. డింపుల్‌ యాదవ్‌ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆమె వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంది. ఆమె శరీర భాగాలు(వీపు, నడుం భాగం) కనపడేలాగా ఉన్నాయి. దుపట్టాతో పూర్తి శరీరాన్ని ఆమె కప్పేసుకుని రావొచ్చు కదా.. ఎందుకు అలా చేయలేదు?. ఇది మత నియమావళిని ఉల్లంఘించడమే. ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడమే అని మండిపడ్డారాయన. అంతేకాదు.. 

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారాయన. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం(జులై 25) అదే మసీదులో తాము సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారాయన. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పాథక్‌ కూడా ఈ ఘటనపై మండిపడ్డారు. ‘‘మతాన్ని రాజకీయం చేయొద్దని రాజ్యాంగం చెబుతుంది. అలాంటిది సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగాన్ని ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటుంది. ఆ పార్టీకి రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం లేదు’’ అని అన్నారాయన. 

బీజేపీ విమర్శలను సమాజ్‌వాదీ తిప్పి కొట్టింది. జాతీయ అంశాలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఇటు అఖిలేష్‌, అటు డింపుల్‌ మండిపడ్డారు. ‘‘బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాళ్లు విమర్శిస్తున్నంతగా అక్కడేం లేదు. నద్వీ మా పార్టీ ఎంపీ. ఆయన మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు కాబట్టే వెళ్లాం. ఎలాంటి సమావేశాలు అక్కడ జరగలేదు. అసలు విషయాల్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇలాంటి అంశాలను తెర మీదకు తెస్తోంది. బీహార్‌ ఓటర్ల అంశం, పహల్గాం ఘటన, ఆపరేషన్‌ సింధూర్‌ ఇవీ ముఖ్యమైన విషయాలు.  వీటితో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు బీజేపీ సుముఖంగా లేదు. అందుకే ఈ అంశంతో రాజకీయం చేస్తోంది’’ అని అన్నారామె. 

ఇక.. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారాయన. తన భార్య డింపుల్‌ వస్త్రధారణ సవ్యంగానే ఉందని, కీలక అంశాలను పక్కదోవ పట్టించేందుకే అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ విమర్శలను ఇటు ఎస్పీతో పాటు అటు కాంగ్రెస్‌ నేతలు సైతం తిప్పి కొడుతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ బీజేపీవి సిగ్గులేని రాజకీయాలంటూ మండిపడ్డారు. డింపుల్‌ యాదవ్‌ వస్త్రధారణ భారతీయ సంప్రదాయాలకు తగ్గట్లే ఉందని, మహిళలను అవమానించే సంస్కృతి ఉన్న బీజేపీకి ఇలాంటి విమర్శలు సహజమేనని అన్నారాయన. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)