Breaking News

గాల్లో బాలిక ప్రాణాలు

Published on Sat, 12/07/2024 - 06:31

లఖింపూర్‌ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్‌ వీల్‌ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్‌ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్‌ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది. 

క్యాబిన్‌ కిందివైపున్న మెటల్‌బార్‌ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్‌ వీల్‌ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్‌బార్‌ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్‌ వీల్‌ను సీల్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)