Breaking News

వేదికపై ఫ్రెండ్స్‌ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!

Published on Tue, 05/23/2023 - 11:15

లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు.

పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది.  కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి.

చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)