Breaking News

ఇక ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’ దాడి ఆపండి.. ట్రంప్‌ హెచ్చరిక

Published on Sun, 07/13/2025 - 08:32

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై దుమారం చెలరేగుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో తన పరిపాలనా యంత్రాంగంపై దాడి చేయవద్దని హెచ్చరించారు.

అమెరికా న్యాయ శాఖ  ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఎప్‌స్టీన్‌కు చెందిన క్లయింట్ జాబితాను దాచినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిన అనంతరం కూడా ఆ అంశాన్ని పలువురు లేవనెత్తుతుండటంతో ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌ జైలులో హత్యకు గురయ్యాడనే వాదనను కూడా అమెరికా న్యాయశాఖ తోసిపుచ్చింది. 2019లో న్యూయార్క్ జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులోని సమాచారాన్ని వెల్లడించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి.

ముఖ్యంగా వారు అటార్నీ జనరల్ పామ్ బోండి, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారు ట్రంప్‌ వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ తాముంతా ఒక బృందంగా ఉన్నామని, తమ పాలనపై వస్తున్న విమర్శలు అర్థరహితమైనవని, కొందరు స్వార్థపరులు ఇతరులను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ తన అటార్నీ జనరల్ తరపున వాదిస్తూ ‘ఎప్‌స్టీన్‌  ఫైల్స్’ అనేది డెమొక్రాటిక్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమని, వారు దీనితో ప్రయోజనాలను పొందాలని ఆశిస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు. ఎవరూ పట్టించుకోని ఎప్‌స్టీన్‌  గురించి సమయాన్ని, శక్తిని వ్యర్థం చేయవద్దని ​కోరారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో తన పేరు ఉందనే ఆరోపణలకు ఆయన ఖండించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)