Breaking News

Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్‌ గౌతమ్‌

Published on Sun, 12/15/2024 - 13:48

పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్‌ గౌతమ్‌.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్‌) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్‌ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్‌ ఇండియా ర్యాంక్‌ వన్‌ (ఏఐఆర్‌ 1) సాధించి, అనురాగ్‌ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.

అనురాగ్ గౌతమ్  బొకారో డీపీఎస్‌ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై  అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్‌  ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

తన కుమారుడు ఎన్‌టీఎస్‌ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం  అనురాగ్‌ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా  ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి  ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్‌ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.

అనురాగ్ సాధించిన  విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు.  ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం  ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్‌.. ప్రేమ కలిపిందిలా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)