Breaking News

దేశ వ్యతిరేక పోస్టులకు జీవితఖైదు!

Published on Thu, 08/29/2024 - 07:29

లక్నో: సోషల్‌ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త డిజిటల్‌ మీడియా పాలసీని రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. అలాగే ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లలో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. 

యూపీ డిజిటల్‌ మీడియా పాలసీ–2024కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికింద దేశ వ్యతిరేక కంటెంట్‌ను పోస్టు చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. మూడేళ్ల నుంచి జీవితఖైదు విధించే ఆస్కారం కలి ్పంచారు. ఇదివరకు దేశ వ్యతిరేక పోస్టులైతే ఐటీ చట్టం సెక్షన్‌ 66ఇ, 66ఎఫ్‌ల కింద నేరంగా చూసేవారు. అసభ్య, పరువునష్టం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్‌ పరువునష్టం అభియోగాలు నమో దు చేస్తారు. 

ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పంచే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు (వారి ఫాలోవర్స్, స్కబ్‌్రస్కయిబర్స్‌ను బట్టి) ఎక్స్‌లో అయితే రూ. 5 లక్షలు, ఫేస్‌బుక్‌లో రూ. 4 లక్షలు, ఇన్‌స్ట్రాగామ్‌లో 3 లక్షలు గరిష్టంగా యూపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. యూట్యూబ్‌లో అయితే ఫాలోవర్లను బట్టి కేటగిరీలు విభజించి, రూ. 8 లక్షలు, రూ. 7 లక్షలు, రూ. 6 లక్షలు, రూ. 4 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇవి నెలవారీ చెల్లింపులు. ఎవరైనా అభ్యంతరక కంటెంట్‌ను పెడితే ఆయా సంస్థలపై కూడా చర్యలుంటాయి.

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)