Breaking News

‘ఉన్నావ్‌’ బాధితురాలిపై నిందితుల దాడి, ఇంటికి నిప్పు..ఇద్దరికి తీవ్ర గాయాలు

Published on Wed, 04/19/2023 - 06:00

ఉన్నావ్‌: యూపీలోని ఉన్నావ్‌ దళిత బాలిక అత్యాచార ఘటనలో నిందితులు మళ్లీ రెచ్చిపోయారు. మరికొందరితో కలిసి బాధితురాలిపై దాడికి తెగబడ్డారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో బాధితురాలి ఆరు నెలల కొడుకుతోపాటు, రెండు నెలల వయస్సున్న సోదరి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్‌కు చెందిన 11 ఏళ్ల బాలికపై గత ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చి, కుమారుడికి జన్మనిచ్చింది.

ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితులు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసును వెనక్కి తీసుకునేందుకు బాధితురాలు నిరాకరించిందనే కోపంతోనే దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన శిశువుల పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్‌ తరలించినట్లు పోలీసులు చెప్పారు. తమ కుమార్తెను అంతం చేసేందుకే నిందితులు ఇంటికి నిప్పుపెట్టారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఉండగా, ఈ కేసులో నిందితులతో రాజీకి నిరాకరిస్తున్నాడనే కారణంతో గత నెలలో బాధితురాలి తాత, మామ కలిసి జరిపిన దాడిలో బాధితురాలి తండ్రి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడు.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు