ఎంపీ రవి కిషన్‌​​కి హత్యా బెదిరింపులు.. చంపేస్తామంటూ..

Published on Sat, 11/01/2025 - 08:50

గోరఖ్‌పూర్: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తమ వర్గాన్ని అనుమానించేలా రవి కిషన్‌ మాట్లాడారంటూ నిందితుడు ఆవేశంతో రగిలిపోయాడు. అయితే, ఈ బెదిరింపులపై ఎంపీ రవి కిషన్‌ స్పందిస్తూ ఇలాంటి ఫోన్‌ కాల్స్‌కు తాను భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో, బెదిరింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ ఘటనలో నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్‌ కుమార్‌.. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్‌ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ద్వివేది స్పందిస్తూ.. ‘రవి కిషన్‌ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. ఎంపీకి సంబంధించి ప్రతీ కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బీహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’ అని హెచ్చరించాడు. ఇదే సమయంలో ఎంపీని ఉద్దేశిస్తూ నిందితుడు పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని తెలిపారు.

ఇదిలా ఉండగా, రవికిషన్‌ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు, ఈ బెదిరింపు ఫోన్‌ కాల్‌పై గోరఖ్‌పూర్‌ ఎంపీ రవి కిషన్‌ స్పందిస్తూ..‘నన్ను ఫోన్‌లో దుర్భాషలాడారు, నా తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటాను. ఇటువంటి వ్యక్తులే సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేస్తారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది నా రాజకీయ వ్యూహం. ఇది నా వ్యక్తిగత గౌరవంపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాదు.. మనందరిపై దాడి’ అని వ్యాఖ్యలు చేశారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)