Breaking News

బడ్జెట్‌ సమావేశాలు.. వక్ఫ్‌ సహా 16 బిల్లులను సిద్ధం చేసిన కేంద్రం

Published on Thu, 01/30/2025 - 14:52

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం.. సభ్యులకు అందజేసింది.

ఇక, ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లోనే (Budgest Session) వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఫైనాన్స్ బిల్లు 2025,  ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2025-26 సంవత్సరానికి గాను వివిధ శాఖల పద్ధులపై పార్లమెంటులో  చర్చ జరగనుంది.  దీనికి సంబంధించిన జాబితాలను అఖిలపక్ష సభ్యులకు అందించింది.

ఇదిలా ఉండగా.. వక్ఫ్‌ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) ఇటీవల సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది. దీంతో, సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)