Breaking News

నమ్మక ద్రోహుల ఓట్లు నాకు అక్కర్లేదు 

Published on Mon, 10/20/2025 - 05:41

పట్నా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేసే కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మరోసారి మైనారిటీలపై అనుచితంగా మాట్లాడారు. బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆదివారం అర్వాల్‌ జిల్లాలో గిరిరాజ్‌ మాట్లాడారు. ‘‘ఒకసారి నేను మౌల్వి(ముస్లిం మతాధికారి)ని ఒక ప్రశ్న వేశా. మీకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యకార్డ్‌ ఉందా? అని అడిగితే ఉంది అని చెప్పారు. హిందూ–ముస్లిం ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం ఈ కార్డ్‌లు ఇచ్చిందని భావిస్తున్నారా? అని అడిగితే లేదు అని సమాధానం చెప్పారు. మీకు నాకు ఓటేశారా? అంటే అవునన్నారు. మరి ఖుదా (దైవం) మీద ప్రమాణంచేసి నిజం చెప్పండి అంటే ఆయన చెప్పలేదు. 

ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకుంటారు. వాటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం మాకు వేయరు. ఇలాంటి వాళ్లనే నమ్మకద్రోహులు అంటారు. మీలాంటి వాళ్ల ఓటు నాకు వద్దు అని ఆయన ముఖం మీదనే చెప్పేశా’’ అని ర్యాలీలో గిరిరాజ్‌సింగ్‌ వెల్లడించారు. ‘‘బిహార్‌లో మొత్తం మౌలికసదుపాయాల కల్పనకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. బిహార్‌లో రోడ్డు కేవలం ఎన్‌డీఏ నేతల కోసం వేయలేదు. మొత్తం ప్రజల కోసం వేశారు. ఇప్పుడు బిహార్‌ ఎంతో మారింది. సమాజంలోని ప్రతి వర్గం కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. అయినాసరే ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేరు’’ అని ఆయన అన్నారు.  
మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)