Breaking News

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కేంద్ర మంత్రి

Published on Wed, 08/21/2024 - 13:40

భోపాల్‌: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్‌ కురియన్‌ను భోపాల్‌లో నామినేషన్‌ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్‌ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.

ప్రస్తుతం జార్జ్‌ కురియన్‌ మోదీ 3.0 కేబినెట్‌లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.  

బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్‌కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.

ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్‌ బిట్టూ (రాజస్థాన్‌ నుంచి), జార్జి కురియన్‌ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్‌ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ..  బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, సీనియర్‌ అడ్వకేట్‌ మనన్‌ కుమార్‌ మిశ్రాను బిహార్‌ నుంచి పోటీకి దించింది. 

సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్‌ఎస్‌  ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)