Breaking News

ఇది నయా భారత్‌...‘హద్దులు’ మీరితే అంతే 

Published on Wed, 05/04/2022 - 00:45

బెంగళూరు: ‘‘ఇది నయా భారత్‌. సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తోంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉరి, పుల్వామాల్లో ఉగ్రవాదుల దాడులకు సర్జికల్‌ దాడులతో మర్చిపోలేని రీతిలో బదులిచ్చామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశ భద్రతపై ఎన్నో విధాలుగా రాజీ పడిందని నిప్పులు చెరిగారు. పాక్‌ దన్నుతో ఉగ్రవాదులు దాడులకు దిగితే హెచ్చరిక ప్రకటనలతో సరిపెట్టేదన్నారు. కానీ మోదీ ప్రభు త్వం వచ్చాక పరిస్థితులన్నీ మారాయని చెప్పారు. మంగళవారం బెంగళూరులో నృపతుంగ వర్సిటీ ప్రారంభోత్సవం తదితరాల్లో షా పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్‌ 370, 35–ఏ రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు అమలు వంటి పలు ఘనతలు మోదీ సర్కారు సొం తమన్నారు. ‘‘ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే రక్తపాతం తప్పదన్న బెదిరింపులను బేఖాతరు చేస్తూ కశ్మీర్‌ను మిగతా భారత్‌లో కలిపేశారు మోదీ’’ అన్నారు.

బొమ్మైకి అమిత్‌ షా అభయం 
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని మారుస్తారన్న వార్తలకు అమిత్‌ షా చెక్‌పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా బొమ్మై కొనసాగుతారని స్పష్టం చేసినట్లు తెలిసింది. సీఎం నివాసంలో విందులో షా పాల్గొన్నారు. పార్టీలో భిన్న స్వరాలు, అసమ్మతుల విషయం తాము చూసుకుంటామని సీఎంకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చినట్టు సమాచారం.

Videos

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)