Breaking News

6 గంటల నిద్ర, 2 గంటల వ్యాయామం

Published on Sun, 04/20/2025 - 03:34

న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన ఆరోగ్య రహస్యాన్ని వివరించారు. సరైన ఆహారం, రోజులో ఆరు గంటల నిద్ర, రెండు గంటలపాటు వ్యాయామం అనే సూత్రాలను తు.చ. తప్పక పాటించడం వల్లే ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. లివర్‌ డే సందర్భంగా శనివారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడారు. 2020 నుంచి పాటిస్తున్న ఆరోగ్య సూత్రాల వల్లే బరువు తగ్గానన్నారు.

 ‘కంటి నిండా నిద్ర, నీరు, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అనే నియమాలను పాటిస్తున్నా. వీటి ఫలితంగానే ఎలాంటి ఇంగ్లిష్‌ మందులను వాడాల్సిన అవసరం నాకు ఇప్పటివరకు రాలేదు. డయాబెటిస్‌ వంటి వ్యాధుల బారిన పడలేదు’అని ఆయన వివరించారు. నేటి యువతరం కూడా ఇటువంటి నియమాలను పాటించి, మరో 40–50 ఏళ్ల ఆయుర్దాయం పెంచుకోవాలని, దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

 ‘శారీరక ఆరోగ్యం కోసం రోజులో రెండు గంటలను వ్యాయామం కోసం కేటాయించండి, మెదడు ఆరోగ్యం కోసం ఆరుగంటలపాటు నిద్రపోండి. ఇది చాలా అవసరం. ఇదే నా అనుభవం’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం, అమిత్‌ షా పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను ప్రధాని మోదీ ఎక్స్‌లో కొనియాడారు. ‘ఆహారంలో నూనెలను తగ్గించుకోవడం వంటి చిన్నచిన్న మార్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒబెసిటీపై అవగాహన కల్పిద్దాం. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం’అంటూ ఆయన పిలుపునిచ్చారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)