Breaking News

కేంద్ర బడ్జెట్‌.. బీహార్‌కు వరాలు!

Published on Sat, 02/01/2025 - 12:23

ఢిల్లీ: పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం చేశారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్రం వ్యూహత్మక అడుగులు వేసింది. బీహార్‌లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బీహార్‌ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా దేశంలో ఆహార ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధిని కల్పిస్తుంది. అలాగే, బీహార్‌లో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అంతేగాక మఖానాను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నారు. దీని ద్వారా మఖానా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ దేశంలోనే మఖానా ఉత్పత్తిలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిని మరింత ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది బీహార్‌కి నిజంగా చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. బీహారీలు చాలా ఏళ్లుగా మఖానాను పండిస్తున్నారు. ఇక, మఖానా అనగా ఇదొక రకమైన ఆహారం. ఇవి ఆకుల మాదిరిగా ఉండి గింజలాంటి నిర్మాణంలో ఉంటాయి. వీటిలో గింజల లాంటివి వస్తాయి. దేశంలో 90 శాతం మఖానాను బీహార్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బీహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అపే పేరు కూడా వచ్చింది. బడ్జెట్‌లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.

బీహార్‌కు వరాలు ఇలా..

  • బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థికసాయం.
  • ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం.
  • పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం
  • ఇందులో భాగంగానే బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
  • బీహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన. దీ
  • దీంతో ఫుడ్‌ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)