ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర గందరగోళం!

Published on Tue, 01/06/2026 - 16:24

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీల ప్రకటన నేపథ్యంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆనవాయితీ ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. అయితే ఈసారి ఆదివారం కావడంతో ఆ తేదీ మారవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.   

దేశవ్యాప్తంగా యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తి నెలకొంది. 2017 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్రం. కానీ, ఈసారి ఒకటో తేదీ ఆదివారం వచ్చింది. సాధారణంగా వారాంతాల్లో పార్లమెంట్‌ సమావేశాలే జరగవు. బ్రిటీష్‌ కాలం నుంచే ఆదివారాలను తప్పించాలనే ఆచారం కొనసాగేది. అలాంటిది.. అందునా ఆదివారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఫిబ్రవరి 1నే కొనసాగిస్తారా? లేదంటే ఫిబ్రవరి 2 (సోమవారం)కి మార్చుతారా? అంటూ చర్చ మొదలైంది. అయితే.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాత్రం.. తుది నిర్ణయం కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో.. ఆదివారం నిర్వహించడంపై సందేహాలు కొనసాగుతున్నాయి. 

అలాగని వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్త విషయమేమీ కాదు. 2025లోనూ శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. గతంలో..  అరుణ్‌ జైట్లీ ఫైనాన్స్‌ మినిస్టర్‌గా ఉన్నప్పుడు 2015లో శనివారం, 2016లో ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.  2020లో కోవిడ్ సమయంలో.. అలాగే 2012 మే 13వ తేదీన 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్‌ సమావేశమైంది కూడా. దీంతో ఈసారి కూడా ఆదివారమే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అస్కారం లేకపోలేదు. 

ఫిబ్రవరి 1నే ఎందుకంటే..
2017 ఏడాదికి ముందు బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టబడేది. అయితే.. బడ్జెట్‌ ప్రవేశపెట్టాక మొదటి త్రైమాసిక ఖర్చుల కోసం ‘వోట్ ఆన్ అకౌంట్’ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత విభాగాల వారీగా డిమాండ్లను పరిశీలించి పూర్తి బడ్జెట్ ఆమోదించబడేది.ఈ ఆలస్యాన్ని నివారించేందుకు 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీంతో ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం లభించింది.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)