Breaking News

అన్సారీ ఆస్తుల కోసం కుమారుని దొంగ పత్రాలు.. కోర్టులో బెడిసికొట్టిన ప్లాన్‌

Published on Mon, 08/04/2025 - 09:14

లక్నో: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను తిరిగి  దక్కించుకునేందుకు అతని కుమారుడు ఉమర్ అన్సారీ చేసిన ‍ప్రయత్నం విఫలమయ్యింది. ఇందుకోసం నకిలీ పత్రాలను ఆధారాలుగా చూపిన ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఉదంతంపై ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో.. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో యూపీలోని బండాలో గల ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ కన్నుమూశాడు. తాజాగా తన తండ్రి ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ అతని కుమారుడు ఉమర్ అన్సారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇందుకోసం అతను తన తల్లి అఫ్షాన్ అన్సారీ నకిలీ సంతకాలు కలిగిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించాడని సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా పరారీలో ఉన్న ఉమర్‌ అన్సారీపై రూ.50 వేల రివార్డు ఉంది. ఉమర్‌ అన్సారీ మోసపూరిత చర్యలు బయటపడిన దరిమిలా అతనిపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లోని వివిధ సెక్షన్ల కింద  కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా ఘాజీపూర్ పోలీసుల బృందం లక్నో నుండి ఉమర్ అన్సారీని అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)