ఉద‌యనిధి స్టాలిన్‌కు ఊర‌ట‌

Published on Tue, 08/04/2026 - 14:29

సాక్షి,చెన్నై: డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ఉదయనిధి స్టాలిన్‌ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్‌కు సూచించింది. 

సోమవారం తంజావూరులో కర్ణాటక,తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయం దుమారం రేగింది. దీనిపై అధికార టీవీకే పార్టీతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తమిళనాడులోని పలు  పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై నీలాంకరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేయగా.. ఈ లోపు ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.  

ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం ప్రత్యేక విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఉదయనిధిని తంజావూరుకు తరలించినప్పటికీ, ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. కేవలం విచారించి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఉదయనిధికి బెయిల్.. కోర్టు కీలక నిర్ణయం

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజే ఆయనను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో డీఎంకే శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)