Breaking News

గుహలో దాక్కున్న ఉగ్రవాదులు.. స్పెషల్‌ ఆపరేషన్‌తో ఖతం

Published on Wed, 02/04/2026 - 13:19

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు బుధవారం స్పెషల్‌ ఆపరేషన్‌తో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ గుహలో తలదాచుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పక్కా సమాచారం అందుకున్న బలగాలు ఎన్‌కౌంటర్‌లో వాళ్లను హతమార్చి ఆపరేషన్‌ పూర్తి చేశాయి. 

భద్రతా దళాలు ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో.. ఆపరేషన్ క్లిష్టంగా మారినా, సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు సాగి వారిని అంతం చేసింది. ఈ ఆపరేషన్‌లో.. గుహ నుంచి రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నారా? అనే అనుమానంతో  గాలింప చర్యలను ముమ్మరం చేశాయి.

జైష్-ఎ-మొహమ్మద్ గతంలో కూడా జమ్మూ కశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో ఆ దాడుల ఆగిపోయాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆ సంస్థ యాక్టివ్‌ అయ్యింది. భద్రతా బలగాలు సకాలంలో స్పందించడంతో దాడుల ముప్పు తప్పింది.

మంగళవారం సైతం ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్, మజల్టా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి. అయితే ఉగ్రవాదులు ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభించాయి. ఇవాళ్టి ఉదంపూర్‌ గుహ ఎన్‌కౌంటర్‌లో మరణించింది.. ఆ ఉగ్రవాదులే అయ్యి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. దీనిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. 

ఇటీవల కిష్ట్వార్ జిల్లాలో జరిగిన "ఆపరేషన్ త్రాషి-1" పేరిట భద్రతా బలగాలు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఆ ఆపరేషన్‌లో జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లతో సుదీర్ఘ కాల్పులు జరిగి, ఒక పారా ట్రూపర్ మరణించగా, పది మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా ఉదంపూర్‌లో జరిగిన ఆపరేషన్‌ దీనికి కొనసాగింపుగా తెలుస్తోంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)