Breaking News

Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి

Published on Sun, 08/11/2024 - 07:11

మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) కార్యకర్తలు  ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్‌ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్‌ఎన్‌ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.

పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)