Breaking News

ఉద్ధవ్‌కు ఎదురుదెబ్బ    

Published on Sun, 11/24/2024 - 06:06

ముంబై: హిందుత్వ ఫైర్‌బ్రాండ్‌ బాల్‌ ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్‌ ఠాక్రే అదే హిందుత్వకు దూరమై, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మహారాష్ట్రలో సరిగ్గా ఐదేళ్ల క్రితం బీజేపీతో జట్టుకట్టి, ముఖ్యమంత్రి కూడా అయిన ఉద్ధవ్‌ ఇప్పుడు మళ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. 

మహా వికాసఅఘాడీ పేరిట చేసిన సెక్యులర్‌ ప్రయోగం ప్రయోజనం చేకూర్చలేదు. శివసేన సిద్ధాంతానికి సరిపడని కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌ పవార్‌)తో కలిసి కూటమి కట్టడం ఉద్ధవ్‌కు నష్టం చేకూర్చింది. కూటమి పొత్తులో భాగంగా 95 సీట్లలో పోటీకి దిగిన శివసేన(ఉద్ధవ్‌) 20 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఉద్ధవ్‌ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

సమాధానం చెప్పాల్సిందే  
శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ బాల్‌ ఠాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్‌ తొలుత సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. సీనియర్‌ నేత నారాయణ రాణేతోపాటు వరుసకు సోదరుడయ్యే రాజ్‌ ఠాక్రే నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ తండ్రి అండతో నిలదొక్కుకున్నారు. బీజేపీతో దశబ్దాలుగా కొనసాగుతున్న పొత్తు శివసేనకు లాభించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి నెగ్గింది. 

ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రి పదవి వరించింది. కోవిడ్‌–19 మహమ్మారి ఉధృతి సమయంలో ఉద్ధవ్‌ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. సీఎం అయిన కొన్నాళ్లకే ఉద్ధవ్‌పై సొంత పారీ్టలో అసంతృప్తి బయలుదేరింది. శివసేనలో ఒక వర్గం నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 2022 జూన్‌లో శివసేనను ఏక్‌నాథ్‌ షిండే చీల్చేశారు. ఉద్ధవ్‌ ప్రభుత్వం కూలిపోయింది. మరోదారి లేక ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌ పవార్‌)తో పొత్తు పెట్టుకున్నారు.

 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు పనిచేయలేదు. అసలైన శివసేన తమదేనని ఏక్‌నాథ్‌ షిండే శనివారం ఫలితాల తర్వాత ప్రకటించారు. ఉద్ధవ్‌ఠాక్రే వయసు64 ఏళ్లు. పారీ్టలో అరకొరగా మిగిలిన నేతలను, కార్యకర్తలను ఆయన ముందుకు నడిపించగలరా? పార్టీని సజీవంగా ఉంచగలరా? అనేదానిపై చర్చ మొదలైంది. శివసేన పార్టీ, ఆ పార్టీ గుర్తు ఇప్పటికే ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి దక్కాయి. వాటిని తిరిగి సాధించుకోవడం అనుకున్నంత సులభం కాదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)