Breaking News

20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్‌.. దేనికి సంకేతం?

Published on Sat, 06/28/2025 - 13:59

మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. రాజకీయంగా తీవ్ర విభేదాలతో రెండు దశాబ్దాలపాటు దూరంగా ఉన్న సోదరులు ఉద్దవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రే.. ఒకే వేదికను పంచుకోబోతుండడమే ఇందుక కారణం. ఈ బ్రదర్స్‌ రీయూనియన్‌పై ఇప్పుడు మరాఠానాట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) కింద త్రిభాషా సూత్రం అమలులో భాగంగా.. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విపక్షాలు జులై 5వ తేదీన నిరసనకు పిలుపు ఇచ్చాయి. ఈ కార్యక్రమానికి శివసేన ఉద్దవ్‌ థాక్రే వర్గం(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్‌) అధినేతలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ పోస్టులో శివసేన (యూబీటీ)ఎంపీ, ప్రతినిధి సంజయ్ రౌత్ తెలియజేశారు. 

తొలుత ఈ రెండు పార్టీలు ఈ అంశంపై వేర్వేరుగా నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు మరాఠీల ప్రయోజనం కోసం వేర్వేరు నిరసనలు నిర్వహించడం సముచితం కాదని గ్రహించి, నిరసన ప్రదర్శనలను సంయుక్తంగా నిర్వహించాలని ప్రతిపాదించారు. 

మహారాష్ట్ర సర్కారు మరాఠీ , ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతుల వరకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.  దీనిపై పలు వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్‌ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్‌ థాక్రే.. బాల్‌ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..

90వ దశకంలో శివసేనలో రాజ్‌ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్‌ థాక్రే అభిమానులు రాజ్‌నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్‌ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. దీంతో రాజ్‌ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగాయి.

దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవాలనుకోవడం..  మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఐక్యతా? లేక శివసేన పునఃఏకీకరణకు సంకేతమా?.. బీజేపీ రాజకీయంపై ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతోందో?.. అంటూ మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తోంది. 

ఇది కూడా చదవండి: kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్‌.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)