Breaking News

వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది

Published on Mon, 02/03/2025 - 12:25

ఉదయపూర్‌: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒక వివాహ వేడుకకు హాజరైన అతిథులు అక్కడ వడ్డించిన విందులో పాల్గొన్నాక అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం తింటున్న సమయంలోనే కొందరు వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోయారు.

విందు భోజనం వికటించిన ఘటన ఉదయ్‌పూర్‌లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంపాలైనవారంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. మరికొంతమంది బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించేందుకు ఆస్పత్రిలో తగినంతమంది వైద్యులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించారు. బాధితులు కడుపు నొప్పితో తల్లడిల్లిపోతుండటాన్ని చూసిన వైద్యసిబ్బంది వెంటనే వారికి ప్రథమచికిత్స  అందించారు. దీంతో పలువురి ఆరోగ్యం కాస్త కుదుటపడింది.

సమాచారం అదుకున్న పోలీసులు ఆ పెళ్లిలో వండిన ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. బాధితుల్లో 15 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం 200 మంది బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ప్రత్యేక వార్డులో 57 మందికి చికిత్స అందిస్తున్నారు.  కొందరు బాధితులకు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నవారిలో ఉన్నారు.

ఉదయపూర్‌లోని ధన్ మండిలోని ఓస్వాల్ భవన్‌లో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మందికి విందు ఏర్పాటు చేశారు. ఉదయపూర్‌తో పాటు వివిధ జిల్లాల నుండి కూడా జనం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆహారం తిన్న తర్వాత  వందలమంది అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి బాధితులను ఎంబీ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: ‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు‌ 13228.. 72 గంటలు లేటుగా ..’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)