Breaking News

గూగుల్‌ మ్యాప్స్‌ అనుసరిస్తూ నదిలోకి..

Published on Mon, 07/01/2024 - 06:28

కాసర్‌గోడ్‌: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్‌ మ్యాప్స్‌లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. 

‘‘గూగుల్‌ మ్యాప్స్‌ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్‌ షేర్‌ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్‌ రషీద్‌ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)