Breaking News

Video Viral: ఢిల్లీ మెట్రోలో మహిళల ఫైటింగ్‌.. తగ్గేదేలే!

Published on Thu, 09/07/2023 - 12:13

వింత వింత ఘటనలతో ఇటీవల ఢిల్లీ మెట్రో  తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల చేష్టలు, ప్రేమికుల రొమాన్స్‌, డ్యాన్స్ రీల్స్, మహిళ ఘర్షణలు వంటి వీడియోలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెట్రో ట్రైన్‌లో అభ్యంతరకర, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చేష్టలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌​ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తాజాగా మరో వీడియోతో సోషల్‌ మీడియాలో  ఢిల్లీ మెట్రో ట్రెండింగ్‌గా మారింది. 

మెట్రో రైలు కోచ్‌లో  ఇద్దరు మహిళలు వాదులాడుకున్నారు. బ్లాక్‌, ఎల్లో డ్రెస్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరినొకరు బట్టలు, జుట్టు లాగుతూ కొట్టుకున్నారు. వీరిలో బ్లాక్‌ డ్రెస్‌ ఆమె రెచ్చిపోయి ప్రవర్తించింది. అక్కడే ఉన్న ఓ మహిళ పోలీస్‌ అధికారి, చుట్టుపక్కల వారు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతేగాక ‘నేను జడ్జి కూతుర్ని, నిన్ను నేను వదిలిపెట్టను’ అంటూ పోలీస్‌ను హెచ్చరించింది సదరు మహిళ.

మరో మహిళ తాను ఏం తప్పు చేయలేదని ఎవరిపై శారీరకంగా దాడి చేయలేదని తెలిపింది. అయినా న్యాయమూర్తి కుమార్తెను అంటూ చెప్పుకుంటున్న మహిళ తగ్గకుండా తన హోదాను అడ్డుపెట్టుకొని వీరంగం సృష్టించింది. చివరికి స్టేషన్‌ రావడంతో ఇద్దరిని మెట్రో దిగి వెళ్లాలని పోలీస్‌ అధికారి సూచించడంతో వారు వెళ్లిపోయారు. ఈ వీడియోను ఘర్ కా కాలేష్ అనే ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
చదవండి: పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!

అయితే అసలు వాళ్ల సమస్య ఏంటి? గొడవెందుకు? అనేది తెలియలేదు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఏంటీ బ్రో.. ఈ ఆడవాళ్లు మరీ ఇలా తయారయ్యారు. వీళ్లకు ఎక్కడ చూసిన గొడవలేనా. అయినా ఇవన్నీ ఢిల్లీ మెట్రోలో సాధారణమే. నల్ల రంగు దుస్తులు ధరించిన మహిళ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది.  మహిళా పోలీస్ అధికారికి సెల్యూ చేద్దాం’అని రకరకాలుగా కామెంట్ ఇచ్చారు.

.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)