Breaking News

Bihar: ఓటర్ లిస్టులో ఇద్దరు పాక్‌ మహిళలు.. దర్యాప్తు షురూ

Published on Sun, 08/24/2025 - 13:07

పట్నా: బీహార్‌ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్‌లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్‌లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల  ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల  వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.

భాగల్పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)మాట్లాడుతూ  ఆ మహిళలకు సరిపోయే పాస్‌పోర్ట్ వివరాలతో  కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్‌పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్‌లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు.
 

కాగా ఈ పాక్‌ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది.  తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని దానిలో కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన  ఓటరు కార్డుల సవరణ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇవి జరగుతున్నాయని ఆరోపించాయి. అయితే నిస్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యతతోన ఈ సవరణ చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు.
 

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)