Breaking News

డ్రైవర్‌ వీరంగం.. టోల్‌ ప్లాజా గేటు ధ్వంసం

Published on Tue, 12/30/2025 - 12:42

బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్‌లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ, గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి, దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్‌లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.

నిందితులు అంతటితో ఆగకుండా, తమకు తోడుగా మరికొందరిని పిలిపించి, మరోమారు టోల్ ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు  పనులు నిలిచిపోయాయి. టోల్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు బంట్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది రక్షణ కోసం భద్రతను పెంచాలని, ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ దృశ్యాలను  సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)