Breaking News

జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్‌ గజరాజులు

Published on Sat, 09/21/2024 - 08:10

బెంగళూరు: మైసూర్‌ ప్యాలెస్‌ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి అక్కడ.

రెండు ఏనుగులు ధనంజయ, కంజన్‌లు ఒకదానితో ఒకటి కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో ఒక ఏనుగు మరొకదాన్ని తరమడంతో.. జయమార్తాండ గేట్‌ గుండా బయట ఉన్న ఎగ్జిబిషన్‌ రోడ్‌కు వచ్చేశాయి.

వెనకాల ఏనుగుపై మావటివాడు ఉన్నప్పటికీ.. ఏనుగు నియంత్రణ కాలేకపోయింది. దీంతో రోడ్లపై ఉన్న జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే కాసేపటికే మావటిలు, అధికారులు ఏనుగులు నియంత్రించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటనలో  ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.

మైసూర్‌ దసరా ఉత్సవాల్లో భాగంగా.. రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఉరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లక్షల మంది హాజరయ్యే ఈ ఉరేగింపునకు అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణ. అయితే గత రెండు దశాబ్దాల్లో.. ఉరేగింపులోగానీ, శిక్షణలోగానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు జరగలేదని అధికారులు అంటున్నారు. 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)