Breaking News

హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన మహిళా పోలీసులు.. నెటిజన్ల ఫైర్..

Published on Sun, 04/09/2023 - 20:04

ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి.  ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది.

అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు.  ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు.

దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి,  చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవే (దాదర్) అని బదులిచ్చాడు.

అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్‌లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు.
చదవండి: ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)