Breaking News

 ఇండో- బంగ్లా జూలీ ప్రేమకథ.. కట్ చేస్తే.. బిగ్ ట్విస్ట్..

Published on Thu, 07/27/2023 - 21:23

లక్నో: సీమా హైదర్‌-సచిన్, అంజూ-నస్రుల్లాల సరిహద్దులు దాటిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. సీమా హైదర్‌ పాకిస్థాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సచిన్‌ కోసం దేశం విడిచి వచ్చింది. అంజూ- నస్రుల్లా ప్రేమ కథలో అంజూ పాకిస్థాన్‌లోని నస్రుల్లా కోసం భారత్ వీడింది. ఈ ఘటనల తర్వాత  ప్రియుడి కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ వచ్చిన మరో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ.. భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌ల ప్రేమ కథ వివాదంతో బయటపడింది. 

ఫేస్‌బుక్‌ ప్రేమ..
బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ అనే వివాహిత ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లోని అజయ్‌లు 2017లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2022లో బంగ్లాదేశ్‌లో ఉన్న జూలీ భర్త మరణించాడు. ఆ తర్వాత అజయ్‌ కోసం బంగ్లా విడిచిన జూలీ.. అజయ్ కోసం భారత్‌ వచ్చేసింది. ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే.. ఉద్యోగం రీత్యా అజయ్‌ కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యను ఇంటి దగ్గరే ఉంచాడు. ఇక కొన్ని రోజుల్లోనే అత్తకోడళ్ల గొడవ కారణంగా జూలీ పుట్టిల్లు బంగ్లాదేశ్‌ వెళ్లిపోయింది. 

ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్‌ విచారణలో సంచలన నిజాలు!

బిగ్ ట్విస్ట్‌..
విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన అజయ్‌.. తల్లిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై కూడా అజయ్ తల్లి గొడవ పడగా.. కోపంతో ఇంటిని విడిచి వెళ్లాడు. అయితే.. తాజాగా అజయ్ రక్తమోడుతున్న ఫొటోతో పోలీసులను ఆశ్రయించింది అతని అమ్మ. తన కొడుకును రక్షించాల్సిందిగా వేడుకొంది. అయితే.. పోలీసులు అతన్ని బంగ్లాదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తీసుకువచ్చారు. తాను బంగ్లాదేశ్‌ వెళ్లలేదని, పశ్చిమ బెంగాల్‌లోని ఓ సరిహద్దు గ్రామంలో అద్దె ఇంట్లో ఉన్నానని మీడియాకు అజయ్‌ వెళ్లడించాడు. ఇటీవల కురిసిన వర్షాల్లో కాలుజారి తలకు దెబ్బ తాకినట్లు తెలిపాడు. 

ఇటీవల మొరాదాబాద్‌కు చేరిన అజయ్‌ని పోలీసులు విచారించగా.. బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ వెళ్లబోనని తెలిపాడు. కానీ అతని తలకు గాయాల ఎలా తగిలాయి? అనే అంశాలు ఇంకా బయటికి రాలేదు. అజయ్ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.   

ఇదీ చదవండి: పాక్‌ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..?

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)