Breaking News

కరూర్‌ ఘటన.. రేపు సీబీఐ విచారణకు విజయ్‌

Published on Sun, 01/11/2026 - 15:13

చెన్నై: తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్‌ తొక్కిసలాట (Karur stampede) కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ (Actor Vijay).. రేపు సీబీఐ(CBI) విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ అవుతారా? అని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, కరూర్‌ తొక్కిసలాట ఘటనలో సీబీఐ (CBI) మూడు రోజుల క్రితమే విజయ్‌కు సమన్లు జారీచేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. కరూర్‌ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు విజయ్‌ హాజరు అవుతుండటం చర్చకు దారి తీసింది.

కాగా, విచారణలో భాగంగా విజయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్లాన్‌ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. విజయ్‌.. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై అనుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే టీవీకే పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బీజేపీ కూడా విజయ్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సీబీఐ విచారణ జరగడం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్‌ 27న తమిళనాడులోని కరూర్‌ పట్టణంలో విజయ్‌ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక మూడు రోజుల క్రితం విజయ్‌కి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 12న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో విజయ్‌ని విచారించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు