Breaking News

6 గంటలకుపైగా విజయ్‌ను ప్రశ్నించిన సీబీఐ

Published on Mon, 01/19/2026 - 07:52

సాక్షి, చెన్నై: తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్‌ 27న 41 మంది ప్రాణాలను బలిగొన్న కరూర్‌ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ను ఇరికించే కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసకేస్తే రాలనంత జనం వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని వెంటనే ముగించి జనాన్ని పంపేయకుండా సుదీర్ఘ ప్రసంగాలు చేశారని, అందుకే జనం అక్కడే ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్న కోణంలో నేరాభియోగాలు మోపాలని, ఆ చార్జ్‌షీట్‌లో విజయ్‌ పేరును చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. 

విజయ్‌తోపాటు అదనపు డీజీపీ, మరో తమిళనాడు సీనియర్‌ పోలీస్‌ అధికారి పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు కరూర్‌ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా సోమవారం సైతం విజయ్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏకధాటిగా ఆరు గంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు విజయ్‌ ఢిల్లీ లోథీ రోడ్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సోమవారం ఉదయం 10.20 గంటలకువచ్చారు. 

ర్యాలీని ఏ తరహాలో చేయాలని ప్రణాళిక వేశారు?. షెడ్యూల్‌ సమయం కంటే చాలా ఆలస్యంగా ఎందుకు ర్యాలీకి రావాల్సి వచ్చింది? జనం విపరీతంగా వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు?. జనం అదుపుతప్పుకున్నారని అర్థమయ్యాక కూడా జనాన్ని కట్టడిచేసే చర్యలను మీ పార్టీ శ్రేణులు ఎందుకు తీసుకోలేదు? వంటి పలు రకాల ప్రశ్నలకు విజయ్‌ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్నింటికి సమాధానం చెప్పిన విజయ్‌ మరికొన్నింటికి వివరణ ఇచ్చేందుకు గడువు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విచారణ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్‌ను నుంచి బయటకు వచ్చి తాను బసచేస్తున్న హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ కేసులో ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ తన తొలి నేరాభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించనుంది.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు