Breaking News

రసవత్తరంగా జార్ఖండ్‌ రాజకీయం.. సోరెన్‌ సర్కార్‌కు బలపరీక్ష

Published on Mon, 02/05/2024 - 07:50

రాంచీ: జార్ఖండ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు చంపయ్‌ సోరెన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. దీంతో, జార్ఖండ్‌లో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, హైదరాబాద్‌లో ఉన్న 40 మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్వరాష్ట్రం చేరుకున్నారు.

కాగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్‌(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్‌) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుత కూటమికి బలపరీక్షను గెలిచే ఛాన్స్‌ ఉంది. 

మరోవైపు.. జేఎంఎం  ఎమ్మెల్యే లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఆ పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటానని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదికగా గళమెత్తుతానని లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ అన్నారు. తన సలహాను పట్టించుకోనందుకే మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చోటా నాగ్‌పుర్‌ అద్దె చట్టం, సంథాల్‌ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జేఎంఎం పేర్కొంది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. 

కేంద్రం ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ చట్టం-1996ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. తొలి రెండు చట్టాలు గిరిజనులకు భూ హక్కులు కల్పించేవి కాగా, పీఈఎస్‌ఏ చట్టం గ్రామసభలకు బలాన్నిస్తుంది. గిరిజనుల హక్కులను కాపాడుతుంది. కానీ, ఈ మూడింటినీ హేమంత్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకే జార్ఖండ్‌ బచావో మోర్చా ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇక విష్ణుపూర్‌ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి రాలేదు. ఆయన అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన అసలు ఎవరికీ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. సోమవారం విశ్వాసపరీక్షకు ఆయన గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నాయి. కాగా.. సోమవారం నాటి పరీక్షలో హేమంత్‌ సోరెన్‌ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)