Breaking News

‘ట్రంప్‌కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు

Published on Sat, 07/05/2025 - 11:48

న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జూలై తొమ్మిదిలోగా ఖరారయ్యే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలకు సంబంధించి నిర్దేశించిన గడువుకు ప్రధాని మోదీ సాత్వికంగా తలొగ్గుతారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో రాహుల్‌ ఒక పోస్ట్‌లో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే, దానిని ఖరారు చేసేందుకు భారత్‌ తొందరపడదంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన ప్రకటనను రాహుల్‌ గుర్తుచేశారు. పీయూష్‌ గోయల్‌ ఈ విధమైన ప్రకటన చేసినప్పటికీ, ప్రధాని మోదీ అమెరికా విధించిన సుంకాల గడువుకు మృదువుగా తలొగ్గుతారని రాహుల్‌ పేర్కొన్నారు.
 

ప్రతిపాదిత తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై భారత్‌- అమెరికన్ అధికారుల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. ట్రంప్  యంత్రాంగం విధించిన పరస్పర సుంకాలపై 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. అప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరని పక్షంలో.. అమెరికన్ వస్తువులపై భారత సుంకాలకు ప్రతిగా ట్రంప్ విధించిన మునుపటి అమెరికా సుంకాలు తిరిగి అమలయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ యంత్రాంగం భారత ఎగుమతుల శ్రేణిపై 26 శాతం సుంకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలు ప్రారంభించిన దరిమిలా ఈ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు.

న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పీయూష్‌ గోయల్ మాట్లాడుతూ, భారత్‌ పరస్పరం ప్రయోజనకరమైన, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రమే సంతకం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇది విన్-విన్ ఒప్పందంగా ఉండాలని, జాతీయ ప్రయోజనం ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అమెరికాతో సరైన ఒప్పందం ఏర్పడితే, అభివృద్ధి చెందిన ఆ దేశంతో భారత్‌ సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉంటుందని గోయల్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)