Breaking News

ఉత్తర కొరియాతో పెట్టుకుంటున్న ట్రంప్‌.. కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ?

Published on Tue, 08/26/2025 - 09:17

వాషింగ్టన్‌: ఉత్తరకొరియాతో సత్సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన సమావేశంలో ట్రంప్‌ ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సమక్షంలో కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకురావాలనే తన కోరికను అభివ్యక్తం చేశారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్‌ వైట్‌హౌస్‌కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ  ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం  అయ్యేందుకు  ఎదురుచూస్తున్నానని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్‌ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా,దక్షిణ కొరియా సమావేశంలో.. లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ సారధ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్‌ శాంతిని తీసుకురాగలరని ఆశిస్తున్నానని, కిమ్ జోంగ్ ఉన్‌కు సన్నిహితులు కాగలరని, ఉత్తర కొరియాలో ట్రంప్ ప్రత్యేక ప్రపంచాన్ని (రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్) నిర్మించగలరని లీ జే మ్యుంగ్  పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో యూఎస్‌ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసింది.

కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వైట్ హౌస్‌ నుంచి పదేపదే  ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ తన మొదటి పదవీకాలంలోనూ ఉత్తరకొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. గడచిన జూలైలో ట్రంప్.. కిమ్‌తో భేటీని కోరుతూ లేఖ రాయగా, దానిని  ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి కార్యాలయ సిబ్బంది తిరస్కరించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)