Breaking News

‘ట్రంప్‌ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 11/03/2025 - 07:18

న్యూఢిల్లీ:  ఆధునిక కాలంలో జరుగుతున్న ఘటనలపై భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో అన్నింటా అనిశ్చితి పెరిగిపోయిందని, సైబర్‌ సవాళ్లు మరింత వేగవంతం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ట్రంప్‌ ఈ రోజు ఏమి చేస్తారో? రేపు ఏమి చేయబోతున్నారో అతనే చెప్పలేరని ద్వివేది వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌లోని రేవాలో గల టిఆర్ఎస్ కళాశాలలో విద్యార్థులతో ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, నేటి కాలంలో అనిశ్చితి సాధారణమైపోయిందని, భద్రత, సైబర్ యుద్ధం లాంటి సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు  మరింత అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత , అస్పష్టతకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహిచలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారు? రేపు ఏమి చేయనున్నారు? అనేది అతనికే తెలియదని  అనుకుంటున్నానన్నారు. సవాళ్లు చాలా త్వరగా వస్తున్నాయి. పాత సవాలును గ్రహించేలోపే, కొత్తది ఉద్భవిస్తోంది. దీనినే ఇప్పుడు సైన్యం ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో అయినా, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం అయినా సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయన్నారు.

ఇప్పుడు కొత్తగా అంతరిక్ష యుద్ధం, ఉపగ్రహాలు, రసాయన, జీవ, రేడియోలాజికల్, సమాచార యుద్ధాలు మొదలయ్యాయని ద్వివేది పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో కరాచీపై దాడి జరిగిందంటూ అనేక వార్తలు వచ్చాయని, అవి తమకూ చేరాయని, అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో తమకు తెలియదన్నారు.  ఇటువంటి సవాళ్ల పరిషర్కారానికి భూమి, ఆకాశం, నీరు.. ఈ మూడింటిపైనా పని చేయాలని ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Mexico: సూపర్ మార్కెట్‌లో పేలుడు.. 23 మంది మృతి 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)