Breaking News

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Published on Wed, 09/13/2023 - 08:43

జైపూర్‌: రాజస్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సు మీదకు దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. భరత్‌పూర్‌లోని హంత్రా సమీపంలో జైపూర్‌-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం వెలుగుచూసింది.

రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌కు బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున లఖన్‌పూర్ ప్రాంతంలోని అంత్రా ఫ్లైఓవర్ వద్ద బస్సు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. డీజిల్‌ అయిపోవడంతో డ్రైవర్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనకాల నిల్చొని ఉన్నారు. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న ట్రక్కు  బస్సును ఢీ కొట్టింది.

ఈ దుర్ఘటనలో బస్సు వెనకాల వేచి ఉన్న 11 మంది (అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 12 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అంతు, నంద్రం, లల్లు, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్‌గా గుర్తించారు.

ఈ ఘనటలో అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదం జరిగింది. జీపును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరికి గాయలయ్యాయి.
చదవండి: పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)