Breaking News

‘నాకు కొడుకే కావాలి’.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి ప్రాణం తీసిన తండ్రి

Published on Mon, 08/11/2025 - 16:53

అగర్తల: కొడుకులకన్నా కూతురు నయం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఇంకా వివక్ష ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన.. విషాద వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తోంది.

త్రిపుర రాష్ట్రం ఖోవై జిల్లా బేహలాబారి గ్రామంలో దారుణం జరిగింది. త్రిపురా స్టేట్ రైఫిల్స్‌కు చెందిన జవాన్ రతీంద్ర దేవ్‌బర్మా తన ఏడాది కుమార్తెను విషమిచ్చి హత్య చేశారు. అయితే,తండ్రి విషం ఇవ్వడంతో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం త్రిపురా రాజధాని అగర్తల జీబీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.     

నిందితుడు రతీంద్ర దేవ్‌ బర్మా త్రిపురా స్టేట్ రైఫిల్స్‌ పదోవ బెటాలియన్‌ తరుఫున ఏడీసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రతీంద్రదేవ్‌ను కోర్టు మూడు రోజుల రిమాండ్‌ విధించింది.

కుమార్తె మరణంపై గుండెలవిసేలా రోధిస్తున్న తల్లి మిథాలీ.. తన భర్త రతీంద్రదేవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుమార్తెకు బిస్కెట్లు కొనుక్కునే నెపంతో తమ కూతురు సుహాని దేవ్‌ బర్మా విషం తినిపించాడని ఆరోపించింది. తన భర్తకి ఎప్పుడూ కుమారులే కావాలి.  ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చినందుకు తనను నిరంతరం ద్వేషిస్తుండేవారని వాపోయింది. 

మేం బెహలబరిలోని నా సోదరి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు నా భర్త.. నా కుమార్తెను, నా సోదరి కొడుకుకు బిస్కెట్లు కొనిచ్చేందుకు సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. వెంటనే, నా సోదరి కొడుకు, నా కుమార్తె వాంతులు,విరోచనాలు చేసుకున్నారు. నా కుమార్తె నోటి వెంట క్రిమిసంహారక మందు వాసన రావడాన్ని గమనించా. ఆస్పత్రికి తరలించా. కుమార్తెకు.. నా భర్త హాని తలపెట్టి ఉంటాడని అనుమానించా. అతడిని నిలదీశా. కుమార్తెకు విషం ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తే తన కుమార్తె సుహాని ప్రాణాలు తీశాడని, అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తోంది.    

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)