Breaking News

కాంగ్రెస్‌కు భారీ ఝలక్‌

Published on Sat, 02/24/2024 - 07:02

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తాము సొంతంగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పునరుద్ఘాటించడంతో ఇండియా కూటిమి ఆనందం ఆవిరయ్యింది. టీఎంసీ ప్రకటనతో కాంగ్రెస్‌కు మరోమారు చుక్కెదురయ్యింది. 

దీనికిముందు ఇండియా కూటమి, టీఎంసీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై సీట్ల భాగస్వామ్య  చర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ వర్గాలు తమ పార్టీకి మూడవ వంతు సీట్లు కూడా దక్కలేదని మీడియాకు తెలిపాయి. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ చైర్‌పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్‌.. ఢిల్లీ, గుజరాత్, గోవాలలో ‘ఆప్‌’తో సీట్ల కేటాయింపుపై రాజీ కుదుర్చుకుంది. అయితే పశ్చిమబెంగాల్‌లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ మూడవ స్థానంలో ఉంది. కాగా అసోంలో తృణమూల్‌కు రెండు, మేఘాలయలో ఒక సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదని, అందుకే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రెయిన్  పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేలు లేరని, అయినా వారికి రెండు ఎంపీ సీట్లను ఇచ్చి, గెలిపించేందుకు సిద్ధమయ్యామని, దానికి వారు నిరాకరించారని ఆయన  తెలిపారు. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)