Breaking News

అంబులెన్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఆస్పత్రి..

Published on Tue, 06/17/2025 - 06:22

ముంబై: అస్థవ్యస్థమైన ఆరోగ్య వ్యవస్థ అత ని కూతురు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. పసికందు శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ ఇవ్వడానికి ఆస్ప త్రి వర్గాలు నిరాకరించాయి. కూతురు మృతదేహాన్ని సంచిలో వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజనుడు. జూన్‌ 12న నాసిక్‌ జిల్లాలో జరిగి న అత్యంత అమానవీయ ఘటన సోమవా రం వెలుగులోకి వచ్చింది. 

పాల్ఘర్‌ జిల్లాలోని జోగల్వాడి కుగ్రామానికి చెందిన సఖారామ్‌ కవార్‌ భార్య అవిత జూన్‌ 11న ప్రసవ వేదనకు గురైంది. సమీపంలోని ఖోడాలా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్‌ దొరకలేదు. 108కు కాల్‌ చేస్తే స్పందన రాలేదు. ప్రైవేట్‌ వాహనంలో పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గంటసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాలేదు. సమీపంలోని మోఖడా గ్రా మీణ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ వైద్యు లు నాసిక్‌ సివిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌ అందుబాటులో లేక మళ్లీ ఆలస్యమైంది. జూన్‌11న అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి చేరుకుంది. తెల్లవారుజామున ఆమెకు చనిపోయిన ఆడ శిశువును ప్రసవించింది. ఆస్పత్రి జూన్‌ 12న శిశువు మృతదేహాన్ని సఖారామ్‌కు అప్పగించింది. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. బిడ్డను బట్టలో చుట్టుకుని, బస్టాండ్‌కు వెళ్లి.. రూ. 20 క్యారీ బ్యాగ్‌ కొనుక్కుని, అందులో పెట్టుకుని ఎమ్‌ఎస్‌ఆర్టీసీ బస్సులో దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. 

ఏమి మోసుకెళ్తున్నావని ఆయనను ఎవరూ అడగలేదు. ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఎవరితో పంచుకోలేదు. అదే రోజు శిశువును ఖననం చేసి.. జూన్‌ 13న మళ్లీ ఆస్పత్రిలో ఉన్న భార్యకోసం నాసిక్‌కు తిరిగి వచ్చాడు. ఈసారి కూడా అంబులెన్స్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. పచి్చబాలింత అయిన భార్యను.. బస్సులోనే ఇంటికి తీసుకెళ్లాడు. ‘ఆస్పత్రి ఉదాసీనత వల్ల నేను బిడ్డను కోల్పోయాను. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి బాధ ఎదురు కాకూడదు’అంటూ నిస్సహాయతతో కూడిన బాధతో చెప్పాడు సఖారామ్‌.   
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు