Breaking News

National Daughter’s Day 2024: వందే భారత్‌ను పరుగులు పెట్టిస్తున్న రితికా టిర్కీ

Published on Sun, 09/22/2024 - 10:27

జంషెడ్‌పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్‌ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.

జంషెడ్‌పూర్‌లోని జుగ్‌సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపి వందేభారత్‌ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక  చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్‌గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యారు. రితికా భర్త  బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.

రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్‌గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్‌గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందడం  ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు. 

ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)