Breaking News

ఢిల్లీలో తెల్లవారుజామున భూకంపం.. ఉలిక్కిపడిన జనం!

Published on Sun, 08/02/2026 - 08:32

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, నగరంలోని ఉత్తర జిల్లాలో ఉదయం 4:14 గంటలకు ఈ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో 8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.
 

అయితే ఈ భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇదే సమయంలో దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భూకంపాలు నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆదివారం ఉదయం ఈ వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

ఇది కూడా చదవండి: పెరూ: కూలిన విమానం.. 13 మంది దుర్మరణం

Videos

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

Photos

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)