Breaking News

పుణెలో కూలిన విమానం

Published on Sat, 08/09/2025 - 17:07

పుణెలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ఈ ప్రమాదానికి గురైంది. విమానాన్ని నడుపుతున్నప్పుడు, టైర్లలో ఒకటి దెబ్బతిన్నట్లు పైలట్ గమనించాడు. పైలట్ ఉదయం 8 గంటల ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు.

దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత ముందు చక్రం ఊడిపోయింది. విమానం టాక్సీవే నుంచి దారితప్పి విమానాశ్రయంలోని ఒక వైపు  పొదల్లోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. పైలట్ సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు.

మరోవైపు, విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డురావడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేయడానికి ప్రయత్నించాడని అయితే, తిరిగి రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిండంతో ఈ సమయంలో విమానం ముందు చక్రం ఊడిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)