Breaking News

ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్‌ ఎగ్జామినర్‌..

Published on Tue, 05/09/2023 - 20:41

ఇటీవల ట్రైయిన్‌లో టికెట్‌ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్‌ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్‌ ఎగ్జామినర్‌ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్‌ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు.

వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎ‍క్స్‌ప్రెస్‌ నిలంబూర్‌ కొచువేలిలోని అలువా స్టేషన్‌ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్‌ఏసీ టికెట్‌ వచ్చింది. దీంతో ఆమె ఎస్‌4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్‌ ఎగ్జామినర్‌ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్‌ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు.  
(చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)